మొబైల్ వినియోగదారులకి శుభవార్త. ఆగష్టు నుండి జియో ఫోన్ ఉచితం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తమ కంపెనీ 40 వ వార్షికోత్సవ సందర్భం గా ఉచిత మొబైల్ ఫోన్ ఆఫర్ ని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవాలంటే ముందు గా కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత ఒకేసారి తిరిగి పొందవచ్చు. ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతుండగా.. సెప్టెంబర్‌లో ఇది అందుబాటులోకి రానుంది. వాయిస్ కమాండ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని, 22 భాషలు సపోర్ట్ చేస్తుందని తెలిపారు.తర్వాత జియో ఫోన్ టారిఫ్‌లను ముఖేశ్ అంబానీ తెలియజేశారు. ఈ ఫోన్ ద్వారా జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్, అపరిమిత డేటాను అందిస్తున్నట్లు చెప్పారు. ఇందు కోసం నెలకు రూ. 153తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.జియో యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్ గా ఇచినట్లు పేర్కొన్నారు.

